న్యూఢిల్లీ: షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇండియాలో తన మొట్టమొదటి 5 జీ ఎంఐ 10 స్మార్ట్ ఫోన్‌ను మార్చి 31న మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ప్రకటించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు కస్టమర్లు ప్రీ ఆర్డర్లు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ అమెజాన్ ఆన్‌లైన్‌లో సేల్ ప్రారంభం.
12 జీబీ ర్యామ్, 512 స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ఆప్షన్లతో రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్ లభ్యంకానుంది. ధర రూ. 42,400 నుంచి ప్రారంభం కానుందని అంచనా. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ ద్వారా తక్షణం రూ.2500 క్యాష్ బ్యాక్ సదుపాయం. డెబిట్ కార్డ్ ద్వారా రూ. 2 వేల డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగదారలకు లభ్యం కానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో మార్కెట్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే.